GUNTUR DISTRICT NEWS: వేసవి తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

Karthik
3 Views

వేసవి తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు విస్తృతంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత పట్ల సంబంధిత అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రతీ శాఖలో నోడల్ అధికారిని నియమించి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చలివేంద్రియాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల, జిల్లా కార్యాలయాల్లోనూ చలివేంద్రియాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జనకూడలి ప్రదేశాల్లోనూ, ఇతర అవసరమైన ప్రాంతాల్లో చలివేంద్రియాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.*తాగు నీటి ఎద్దడి తలెత్తరాదు, తాగు నీటి ఎద్దడి ఏ గ్రామంలోను తలెత్తరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడే గ్రామాలు గుర్తించాలని, అటువంటి గ్రామాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోర్లను 24 గంటలలో మరమ్మతులు పూర్తి చేయుటకు అవసరమైన విడి పరికరాలు సిద్ధంగా పెట్టాలని ఆదేశించారు. పశువులకు, వీధి కుక్కలకు కూడా తాగునీటిని లభ్యంగా ఉంచాలని సూచించారు. తాగు నీటి నాణ్యత పరీక్షలు ప్రతీ రోజూ చేయాలని ఆదేశించారు. అతిసార కేసులు తలెత్తితే మున్సిపల్ కమిషనర్ లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు బాధ్యత వహిస్తారని చెప్పారు. పైపు లైన్ల ద్వారా వెలుగుతున్న తాగు నీరు ఎక్కడా కలుషితం కాకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగు నీటి పైపు లైన్లు మురుగు నీటి కాలువల గుండా వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ధ్రువీకరించాలని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వడ దెబ్బపై ప్రజల్లో అవగాహన అవసరం. వడ దెబ్బపై ప్రజల్లో అవగాహన అవసరమని, ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. వడ దెబ్బకు గురి కాకూడదని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాలని చెప్పారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పనులు ఉంటే మినహా ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరినవారు బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు చూడాలని చెప్పారు. డీ హైడ్రేషన్ కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, తెనాలి ఇన్ ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review