రైతు ఆదాయం పెంచే దిశగా ప్రాథమిక రంగాల శాఖలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. ప్రాథమిక రంగాల శాఖలతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవసరం మేరకు పంటల విధానాన్ని మార్పు చేసి అధిక ఆదాయం వచ్చే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పంటల వారీగా వస్తున్న ఆదాయాన్ని పరిశీలించాలని, ఉత్తమ మార్కెటింగ్ విధానాలను అనుసరించాలని ఆదేశించారు. రైతుల పెట్టుబడులు తక్కువ కావాలని అందుకు అవసరమగు యాంత్రికరణ పెంచాలని సూచించారు. పొలంబడి కార్యక్రమాలను నిర్వహించాలని అందులో అందుబాటులో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం సేవలు విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. రైతులకు ఈ కేవైసీ, ఇ పంట చేయాలని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం సాంకేతిక పరిజ్ఞానంగా కాకుండా రైతులకు అత్యంత ఉపయోగకరమైన పరికరంగా ఉపయోగించాలని అన్నారు. రైతుకు మంచి ధరలు రావాలని, ఎగుమతి రకం ఉత్పాదకాలు పొందాలని అన్నారు. ఉద్యానవన ఉత్పాదకాలకు పశ్చిమ ఆసియాలో మంచి గిరాకీ ఉందని అన్నారు. మండలాల వారీగా పంటల వివరాలు ఆదాయ మార్గాలు మార్కెటింగ్ తదితర వివరాలతో నివేదిక అందించాలని అన్నారు. ఖరీఫ్ పంటను ముందుకు తీసుకువచ్చే విధంగా ఆలోచన చేయాలని తద్వారా తుఫాన్ల తాకిడి నుండి బయటపడే అవకాశాలు ఉంటాయని అన్నారు.
GUNTUR DISTRICT NEWS: రైతు ఆదాయం పెరగాలి: కలెక్టర్
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
27°C
Vijayawada
overcast clouds
27° _ 27°
85%
2 km/h
Tue
27 °C
Wed
25 °C
Thu
25 °C


