Eluru District city News :ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని పారిజాత గిరిలో ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

S Sarath
1 View

ఏలూరు జిల్లా:- జంగారెడ్డిగూడెంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు సోమవారం సాయంత్రం విశ్వక్సేన పూజతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగనున్నాయి.

రాజమండ్రికి చెందిన ప్రముఖ వేద పండితులు పానంగిపల్లి సత్య పవన్ కుమార్ ఆచార్యులు యజ్ఞ బ్రహ్మగా వ్యవహరించగా, ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో శ్రీ వైఖానస ఆగమశాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. తొలిరోజున విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, మేదినీ పూజ తదితర ఘట్టాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.

Eluru City Newsసంవత్సర కాలంలో స్వామివారి కైంకర్యాల్లో, పూజల్లో, నివేదనల్లో తెలిసి లేదా తెలియక ఏవైనా దోషాలు, పొరపాట్లు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా ప్రతిఏటా ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు వెల్లడించారు.

ఈ పూజా కార్యక్రమాల్లో అర్చకులు రిషికేష్, కుమార్ ఆచార్యులు, రాఘవాచార్యులు పాల్గొని వేద మంత్రోచ్ఛారణల నడుమ క్రతువులను జరిపించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆలయ కార్యనిర్వహణ అధికారి (EO) మానికల రాంబాబు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Author
Share This Article
Leave a review