GUNTUR DISTRICT NEWS: విభిన్న ప్రతిభావంతులకు కోటి రూపాయల విలువైన బ్యాటరీ ట్రై సైకిళ్ల పంపిణీ

Karthik

జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు కోటి రూపాయల విలువైన బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులకు అందజేశారు.ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ శరీరానికి పరిమితులు ఉంటాయేమో గాని, సంకల్పానికి ఉండవు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత బస్సు, పెన్షన్ల పంపిణీ, ప్రోత్సాహకాలు అందించడం జరుగుతోంది. విభిన్న ప్రతిభావంతులు కూడా ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని జీవితంలో ఎదగడంపై దృష్టి సారించాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు ఎందరో తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు. అలాంటి వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని తమ శక్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్,ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ IOCL జనరల్ మేనేజర్ వర్గీస్ చరియన్ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review