GUNTUR CITY NEWS: పన్ను రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి

Karthik
3 Views

ప్రస్తుత ర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 3 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. సోమవారం లలితా సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ 7 అసెస్మెంట్లకు సంబంధించి జనరల్ మేనేజర్ సురేష్ అడ్వాన్స్ ట్యాక్స్ గా రూ.86 లక్షల చెక్ ని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి ప్రకటించిన 5 శాతం రాయితీని నగర ప్రజలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారని, ఇప్పటికే రూ.53.11 కోట్లు ముందస్తు పన్ను చెల్లించారన్నారు. ముందస్తు పన్ను చెల్లించిన లలితా సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నామన్నారు. ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఒకేసారి ఏక మొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీపై 50 శాతం రాయితీని కూడా ఈ నెలాఖరులోపు చెల్లించి పొందవచ్చని తెలిపారు. నగరంలోని ఆస్తి, ఖాళీ స్థల పన్నుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని ఈ నెలాఖరు లోపు ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలని కోరారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా పన్ను సేకరణ క్యాష్ కౌంటర్లు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Author
Share This Article
Leave a review