GUNTUR CITY NEWS: గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

Karthik

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు మొవ్వా వేణుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి కేక్ కట్ చేసి నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవ, రాజకీయ రంగం మరియు సినీ రంగంలో బాలకృష్ణ అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ఆయనకు ఆయురారోగ్యాలు, మరిన్ని విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు.అనంతరం మిర్చి యార్డు డైరెక్టర్ మేళం సైదయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి, డేగల ప్రభాకర్ స్వయంగా కేక్ తినిపించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నందమూరి బాలకృష్ణ మరియు మేళం సైదయ్యలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Author
Share This Article
Leave a review