GUNTUR DISTRICT NEWS: పంచాయతీల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

Karthik
9 Views

వేసవి తీవ్రత దృష్ట్యా పంచాయతీల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి బి.వి నాగ సాయి కుమార్ సూచించారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెం గ్రామ పంచాయతీని గురువారం జిల్లా పంచాయతీ అధికారి సందర్శించారు. సంపద తయారీ కేంద్రంను తనిఖీ చేసి చెత్త నుండి సంపద తయారీకి ప్రణాళిక బద్ధంగా సేకరణ చేసి మెరుగు పరచాలని పంచాయతీ అభివృద్ధి అధికారికి ఆదేశించారు. పంచాయతీలో మోడల్ అమృత్ సరోవర్ చెరువును సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్నీ, గ్రామా పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని తనిఖీ చేశారు. అవసరమైతే మరిన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ ప్రజలకు ఐ.వి.ఆర్.ఎస్ కాల్స్, స్వచ్ఛ రథం వినియోగితపై అవగాహనా కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review