GUNTUR DISTRICT NEWS: అన్ని వర్గాల ప్రజలకు సహకార సేవలు అందిస్తాం

Karthik

విశాఖపట్నం కోపరేటీవ్ బ్యాంక్ ఖాతాదారుల సమావేశం గుంటూరులో జరిగింది. బ్యాంక్ చైర్మన్ జే.వీ సత్యనారాయణ మూర్తి, డైరెక్టర్లు పీ.వీ మల్లిఖార్జునరావు, శ్రీకాంత్, చిన్నం కోటేశ్వరరావు, జోనల్ మేనేజర్ యర్రారెడ్డి, మేనేజర్ రంగనాధ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం కోపరేటీవ్ బ్యాంక్ అందిస్తున్న సేవలను ఛైర్మన్, డైరెక్టర్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో 60 బ్రాంచ్ లు కలిగి ఉందని చెప్పారు. లక్షా 17 వేల మంది షేర్ హోల్డర్ లు, 416 కోట్లు షేర్ క్యాపిటల్ కలిగి ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో షేర్ కాపిటల్ లో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. అదేవిధంగా 8500 కోట్ల టర్నోవర్ కి చేరుకోవడం గర్వంగా ఉందన్నారు.

Author
Share This Article
Leave a review