ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో 444అర్జీలు అందాయి. సోమవారం ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. వయోవృద్ధులు, దివ్యాంగుల వద్దకు నేరుగా వెళ్లి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారు సంతృప్తి మేరకు పరిష్కారం కావాలని, సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. అర్జీలు పరిష్కారంలో ఎటువంటి అలసత్వం ఉండరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో పి.జి.ఆర్.ఎస్ కు మొత్తం 444 అర్జీలు అందాయి. అందులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పి.జి.ఆర్.ఎస్ కు 215, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన పి.జి.ఆర్.ఎస్ కు 148 అర్జీలు, గుంటూరు రెవిన్యూ డివిజన్ పరిధిలో 5 అర్జీలు, తెనాలి రెవిన్యూ డివిజన్ పరిధిలో 26 అర్జీలు, గుంటూరు నగర పాలక సంస్థకు 45, మిగిలిన మున్సిపాలిటీల పరిధిలో 5 అర్జీలు అందాయి.అర్జీదారులు పింఛన్లు, రేషన్ కార్డులు, గృహాలు మంజూరు చేయాలని, భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఆర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగ రాజు, జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా పర్యాటక అధికారి రమ్య, ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, ఎ.పిఎం.ఐ.పి ఎల్. వజ్రశ్రీ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: జిల్లాలో పి.జి.ఆర్.ఎస్ కు 444 అర్జీలు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
31°C
Vijayawada
overcast clouds
31° _ 31°
41%
2 km/h
Wed
37 °C
Thu
34 °C
Fri
33 °C


