మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. రైతులు, వైఎస్సార్సీపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అంబటి మురళి మాట్లాడుతూ మొక్కజొన్న కొలుగోలులో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దళారీ లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత వైసిపి ప్రభుత్వంలో క్వింటా మొక్కజొన్న 24 వేలకు కొనుగోలు చేయడం. జరిగిందని తెలిపారు. అదే పంట ప్రస్తుతం 12 వేలకు పడిపోయాయని పేర్కొన్నారు. తెలంగాణలో సైతం 24 వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కానీ ఎమ్మెల్యే నరేంద్ర రైతుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి సంగం డైరీ దానా కేంద్రాలకు తరలిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్నలు 24 వేల మద్దతు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో రైతులను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.



