
బాపట్ల జిల్లా డీఎస్పీ చంద్రమౌళి కర్లపాలెం పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను అభినందించారు. ప్రయాణికుల సౌకర్యార్థం కర్లపాలెం జాతీయ రహదారి పక్కన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చలేంద్రం ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్సై ఎస్. రవీంద్ర అధ్యక్షత వహించగా, డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, మండల ప్రజలకు రక్షణ కల్పించడంలోనూ, సేవా కార్యక్రమాలు నిర్వహించడంలోనూ ఎస్సై రవీంద్ర చక్కని పాత్ర పోషిస్తున్నారని ప్రత్యేకంగా అభినందించారు.
అలాగే, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది మరియు సేవాభావం కలిగిన ప్రజలు పాల్గొన్నారు.


