జలధార – జల హారతి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా పిలుపునిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం చైర్ పర్సన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జల ధార – జల హారతి వంద రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి చెరువును నిండు కుండలా చేయుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రతి చెరువులో పూడికలు తీసి నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచాలని అన్నారు. చెరువుల్లోకి నీటి పారుదల ఉన్న కాలువల్లో ఎటువంటి పూడికలు లేకుండా నీటిపారుదల నిరాటంకంగా జరుగుటకు దోహదం చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. వైద్య సేవలు మెరుగుపరచాలని, స్థానికంగానే మంచి వైద్య సౌకర్యాలు అందించాలని చెప్పారు. పల్నాడు జిల్లాలో అనుమతులు లేకుండా చేపల చెరువులను నిర్వహిస్తున్నారని, వ్యర్ధాలను కృష్ణ జలాల్లో విడిచిపెడుతున్నారని వాటిపై పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సి.ఆర్.డి.ఏ ప్రాంతంలో ఉన్న భూముల క్రయవిక్రయాలకు ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నల్లమడవాగు, ఇతర జల వనరుల కాలువలను గండ్లను పూడ్చుటకు చర్యలు చేపట్టాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకం కొరకు నిర్మించిన కిచెన్ షెడ్ల పిల్లల పేమెంటులో అందాల్సి ఉందని వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం మాట్లాడుతూ జిల్లాలో 12 వందల చెరువులు ఉన్నాయని, ప్రతీ చెరువును గరిష్ట సామర్థ్యం మేరకు నీటితో నింపుటకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. భూగర్భ జలాల 3 నుండి 6 మీటర్ల మధ్య నీటి మట్టం పెరుగుదల లక్ష్యంగా చేపట్టడం జరుగుతుందని అన్నారు. 15 మీటర్ల కంటే లోతైన ప్రాంతాలు ప్రాధాన్యతగా గుర్తించాలని, కనీసం ఒక మీటరు మెరుగుదల సాధించాలని తెలిపారు. శాటిలైట్ చిత్రాల ద్వారా శాస్త్రీయంగా చెరువుల మ్యాపింగ్ చేయడం, హైడ్రోలాజికల్ విశ్లేషణ ద్వారా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించడం, ఉపాధి హామీ పథకం నిధులతో పనుల అమలు, నిరంతర పర్యవేక్షణ, భూగర్భ జల మట్టాల విశ్లేషణ చేయడం జరుగుతుందన్నారు. గుంటూరు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి వ్యవసాయ శాఖ చేపడుతున్న వివరాలను తెలిపారు ఖరీఫ్, రబీ సీజన్లలో లక్ష్యానికి మించి పంటలు వేయడం జరిగిందని చెప్పారు. ఎరువుల కొరత లేదని తెలిపారు. పల్నాడు, బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారులు ఆయా జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఉమ్మడి గుంటూరు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆయా జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మర్రి రాజశేఖర్, మురుగుడు హనుమంత్ రావు, ఏసురత్నమ్., శాసన సభ్యులు కన్నా లక్ష్మన్నారాయణ, అరవింద్ బాబు, వేగశన నరేంద్ర వర్మ, నక్క ఆనంద్ బాబు, బాష్యం ప్రవీణ్, జూలకంటి బ్రాహ్మరెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ వందనాదేవి భీమనేని, పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహా, ఉమ్మడి గుంటూరు జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎం.పి.పిలు తదితరులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: జలధార – జల హారతి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
36°C
Vijayawada
broken clouds
36° _ 36°
44%
4 km/h
Thu
36 °C
Fri
41 °C
Sat
40 °C


