జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ హెచ్చరించారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో ఆదివారం రాత్రి ఆకస్మికంగా పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. బంకులలో నిల్వలను తనిఖీ చేశారు. ప్రజలకు అవసరమైన మేరకు ఇంధన సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో డీజిల్ కొరతపై వస్తున్న ప్రచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు లోనవుతిన్నారని చెప్పారు. అవసరం లేకపోయినా డీజిల్‌ను నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతోందని చెప్పారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా, సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు, అంబులెన్స్ లకు, పాల సరఫరా వాహనాలకు ఇంధనం నింపడంలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆయిల్ కంపెనీ వారిని సంప్రదించి స్టాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇంధన కంపెనీలతో జాయింట్ కలెక్టర్ ప్రతి రోజూ రెండు సార్లు సంప్రదిస్తున్నారని, ప్రతి బంక్ వద్ద ఒక ఉద్యోగిని నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. *సోషల్ మీడియాలో అవాస్తవాలు వ్యాపింప చేసే వారిపై కేసులు నమోదు* జిల్లాలో పెట్రోలు, డీజిలు కొరత ఏర్పడనున్నదని అవాస్తవాలను సోషల్ మీడియా ద్వారా వ్యాపింపజేసి, ప్రజలను ఆందోళనకు గురి చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాపై నిఘా పెట్టామని చెప్పారు.
GUNTUR DISTRICT NEWS: డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

Total Views: 3
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
29°C
Vijayawada
scattered clouds
29° _ 29°
74%
4 km/h
Mon
29 °C
Tue
41 °C
Wed
42 °C


