GUNTUR DISTRICT NEWS: జిల్లా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం

Karthik
1 View

అరండల్ పేట జిల్లా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం ప్రారంభమైంది. జూన్ 6వ తేదీ వరకు కొనసాగే శిక్షణా శిబిరంలో వివిధ అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. కోటేశ్వరరావు, శిల్పారామం ఛైర్ పర్సన్ మంజులా రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ వందనాదేవి పాల్గొని వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులు సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా అతిథులు సూచించారు. గ్రంధాలయాలు ద్వారానే సంపూర్ణ జ్ఞానం లభిస్తుందని తెలిపారు. పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుకోవాలని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Author
Share This Article
Leave a review