“వర్మా ట్రావెల్స్ బస్సు దారుణం! డీజిల్ లేదు.. డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్! రోడ్డుపై ప్రయాణికుల ఆందోళన.” 🛑

Bhuvana

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాల నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. వేల రూపాయలు వెచ్చించి టిక్కెట్లు కొనుక్కుని ప్రయాణిస్తున్న వారికి నడిరోడ్డుపై నరకం చూపిస్తున్నాయి కొన్ని సంస్థలు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద వర్మా ట్రావెల్స్ బస్సు చేసిన నిర్వాకం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

: వివరాల్లోకి వెళితే.. సుమారు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి పాలకొల్లుకు బయలుదేరిన వర్మా ట్రావెల్స్ బస్సు, సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి-65పై ఇబ్రహీంపట్నం వద్దకు రాగానే అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇంజిన్ రిపేర్ అయ్యిందేమోనని భావించిన ప్రయాణికులు, గంటలు గడుస్తున్నా డ్రైవర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నిలదీశారు. తీరా అసలు విషయం తెలుసుకుని వారు విస్తుపోయారు. బస్సులో డీజిల్ అయిపోవడం వల్లే బస్సు నిలిచిపోయిందని తెలిసింది.

నిరసన తెలుపుతున్న ప్రయాణికులు): కనీసం బస్సులో డీజిల్ ఉందో లేదో చూసుకోని డ్రైవర్ బాధ్యతారాహిత్యంపై ప్రయాణికులు మండిపడ్డారు. దీనిపై ట్రావెల్స్ ఆఫీసుకి ఫోన్ చేస్తే వారు స్పందించలేదు. అటు డ్రైవర్ కూడా ఆయిల్ తీసుకువస్తానని చెప్పి వెళ్లి, తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ప్రయాణికులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. సుమారు రెండు గంటల పాటు నడిరోడ్డుపై మహిళలు, వృద్ధులు నరకయాతన అనుభవించారు.

చివరికి ప్రయాణికులు ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించడంతో కథ సుఖాంతమైంది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు డ్రైవర్‌ను పట్టుకున్నారు. బస్సులో ఆయిల్ మీటర్ పనిచేయకపోవడం వల్లే డీజిల్ అయిపోయిన విషయం తెలియలేదని డ్రైవర్ సంజాయిషీ ఇచ్చాడు. వెంటనే పోలీసులు మానవత్వంతో స్పందించి సమీప బంకు నుంచి 50 లీటర్ల డీజిల్ తెప్పించి బస్సును విజయవాడ, పాలకొల్లు వైపు పంపించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review