Hantavirus కలకలం: క్రూయిజ్ నౌకలో 3 మరణాలు, వణుకుతున్న పర్యాటకులు – అసలు ఈ వైరస్ ఎంత ప్రమాదకరం?

Bhuvana

Hantavirus (హంటర్‌ వైరస్) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను భయాందోళనలకు గురి చేస్తోంది. ముఖ్యంగా అట్లాంటిక్ మహాసముద్రంలోని మారుమూల దీవులను సందర్శించేందుకు బయలుదేరిన ‘ఎంవీ హోండియస్’ క్రూయిజ్ నౌకలో ఈ వైరస్ బయటపడటం కలకలం సృష్టిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి ఇప్పటికే ముగ్గురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. 22 దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్న ఈ నౌకలో వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో అందరినీ క్వారంటైన్‌లో ఉంచారు.

అర్జెంటీనా నుండి ప్రాణాంతక ప్రయాణం

గత నెల ఒకటవ తేదీన అర్జెంటీనా నుండి బయలుదేరిన ఈ నౌకలో 88 మంది పర్యాటకులు, 55 మంది సిబ్బంది ఉన్నారు. అంటార్కిటికా ఖండం మరియు అట్లాంటిక్ లోని అందమైన ప్రదేశాలను చూడాలని వెళ్లిన వారికి Hantavirus ఒక పీడకలగా మారింది. నౌకలో ఉన్న పర్యాటకులలో కొందరికి తీవ్రమైన అనారోగ్య లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఈ నౌక కేప్ వెర్డె సమీపంలో ఉండగా, ముగ్గురు రోగులను మెరుగైన చికిత్స కోసం నెదర్లాండ్స్‌కు తరలించారు.

హంటర్‌ వైరస్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

Hantavirus అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల విసర్జితాలు, మూత్రం లేదా లాలాజలం ద్వారా గాలిలోకి విడుదలయ్యే వైరస్ కణాలను పీల్చడం వల్ల మనుషులకు ఈ వ్యాధి సోకుతుంది.

  • ప్రారంభ లక్షణాలు: జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పులు మరియు అలసట.
  • తీవ్రమైన లక్షణాలు: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తులలో నీరు చేరడం (Hantavirus Pulmonary Syndrome).
  • చికిత్స: దురదృష్టవశాత్తూ ఈ వైరస్‌కు ఇంకా నిర్దిష్టమైన వ్యాక్సిన్ లేదా మందులు అందుబాటులో లేవు.

డబ్ల్యూహెచ్‌ఓ రంగంలోకి: ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

ప్రస్తుత పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. నౌకలోనే తాత్కాలికంగా పరీక్షలు నిర్వహించేందుకు బృందాలను రంగంలోకి దించింది. Hantavirus సోకినట్లు అనుమానం ఉన్న వారిని వేరుగా ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారు త్వరగా చికిత్స పొందని యెడల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం 38% వరకు ఉంటుంది. అందుకే దీనిని అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ల జాబితాలో చేర్చారు.

Author
Share This Article
Leave a review