అసిస్టెంట్ డైరెక్టర్లకు డిప్యూటీ డైరెక్టర్ హోదా.. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు
న్యూఢిల్లీ, :కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (Ministry of Information & Broadcasting) పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (IIS) గ్రూప్ ‘A’ అధికారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రమోషన్లు ప్రకటించింది. జూనియర్ టైమ్ స్కేల్ గ్రేడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్న పలువురు అధికారులను సీనియర్ టైమ్ స్కేల్ గ్రేడ్‌లో డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2024 ప్యానెల్ ఇయర్‌కు సంబంధించిన ఈ పదోన్నతులు CCS (RP) Rules-2016 ప్రకారం పే మ్యాట్రిక్స్ లెవెల్-11లో మంజూరు చేయబడినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధికారులు ప్రస్తుతం పనిచేస్తున్న చోట్లనే “As is where is basis” విధానంలో పదోన్నతులు పొందనున్నారు.
పదోన్నతి పొందిన ముఖ్య అధికారులు వీరే..
ప్రమోషన్ పొందిన అధికారుల్లో:
- శీతల్ అంగ్రాల్ – PIB, న్యూఢిల్లీ
- జైరాజ్ కిశోర్ – CBC, న్యూఢిల్లీ
- సుప్రియా ఘాయతదక్ – CBC, పుణే
- మనుప్రియా – PIB, న్యూఢిల్లీ
- అజీత్ సింగ్ మీనా – DD News, న్యూఢిల్లీ
- రిని చౌదరి – PIB, న్యూఢిల్లీ
- సాయి వేంపటి – CBC, న్యూఢిల్లీ
- తస్నీమ్ ఎఫ్ ఖాన్ – CBC, న్యూఢిల్లీ
- హిమాంక్ కొఠియాల్ – PMO, న్యూఢిల్లీ
- జోషి నికితా సతీష్ – DDK ముంబై
- లలిత ఖురానా – DPD, న్యూఢిల్లీ
- కె. అనురాగ్ – CBC, న్యూఢిల్లీ
- పరఖ్ లౌకిక్ సుమతిలాల్ – CBC, పాట్నా
- ఇస్మీత్ కౌర్ – DPD, న్యూఢిల్లీ
- సుఖ్‌చైన్ సింగ్ – DPD, న్యూఢిల్లీ
- వి.ఆర్. శుక్లా – AIR, రాయపూర్
- అంబ్రిష్ కిశోర్ – DPD, న్యూఢిల్లీ
- భావనా ఏ. గోఖలే – AIR, ముంబై
తదితరులు ఉన్నారు.
కోర్టు తీర్పులకు లోబడి ప్రమోషన్లు
ఈ పదోన్నతులు CAT (Central Administrative Tribunal)లో పెండింగ్‌లో ఉన్న OA No.2586/2019 కేసు తుది తీర్పులకు లోబడి ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి Review DPC నిర్ణయాల ప్రకారం సీనియారిటీ మరియు ప్రమోషన్ అమలులో మార్పులు ఉండవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఉత్తర్వులు
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ దీపక్ నేగి ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. సంబంధిత మీడియా యూనిట్ హెడ్‌లకు, అధికారులకు, మంత్రి కార్యాలయాలకు ఈ ఉత్తర్వుల ప్రతులు పంపినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమోషన్లతో కేంద్ర మీడియా సంస్థల్లో పరిపాలన మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.



