GUNTUR CITY NEWS: జీజీహెచ్ లో ఫ్రంట్ డెస్క్ ప్రారంభం – మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణకు స్పెషల్ వార్డు ఏర్పాటు

Karthik
1 View

ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ కు తలదన్నేలా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. శనివారం స్థానిక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకటేష్ తో మహిళ ఉద్యోగుల పిల్లల డేకేర్ వార్డులో ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్ లో ప్రతి వార్డును బలోపేతం చేస్తూనే మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ యశస్వి రమణ ఆధ్వర్యంలో రోగుల సౌకర్యార్థం ఫ్రంట్ డెస్క్ ప్రారంభించామని‌ చెప్పారు.. రోగులు ఏ వార్డులో ఉన్నారు ? ఎన్ని రోజుల క్రితం అడ్మిట్ అయ్యారు ? ఎలాంటి సేవలు పొందుతున్నారు ? వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటి ? ఏ డాక్టర్ ఆధ్వర్యంలో వైద్యం అందుతుంది వంటి అంశాలన్నింటినీ ఫ్రంట్ డెస్క్ ద్వారా తెలియజేస్తారన్నారు కార్పొరేట్ వైద్యశాలలో మాత్రమే ఉండే ఇలాంటి సేవలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని‌ చెప్పారు.. మహిళా ఉద్యోగుల పిల్లల డే కేర్ యూనిట్ మహిళల పట్ల కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల స్ఫూర్తితో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ యశస్వి రమణ సంకల్పంతో రోటరీ క్లబ్, ఎన్జీవోస్ సహకారంతో l చంటి పిల్లల సంరక్షణ తల్లుల శ్రేయస్సు కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకమైన వార్డు ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. విధులకు హాజరైన మహిళలు తమ పిల్లల్ని డేకేర్ సెంటర్లో గానీ, ఇతర సంరక్షణ పద్ధతుల్లో ఉంచినప్పటికీ పిల్లల గురించి ఆందోళన చెందుతూనే ఉంటారన్నారు. అలాంటి సమయంలో విధులు నిర్వహించే ప్రదేశంలోనే పిల్లల కేర్ యూనిట్ ఏర్పాటు చేయడం రోగులకు మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.

Author
Share This Article
Leave a review