పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి పునరంకితం – ఘనంగా టీడీపీ క్యాడర్ మీటింగ్

City News Telugu

పోలవరం:పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో క్యాడర్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శ్రీ బొరగం శ్రీనివాసులు పాల్గొని నియోజకవర్గ అభివృద్ధి పనులు, రాబోయే కార్యక్రమాలు మరియు పార్టీ బలోపేతంపై క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణవాయువు అని కొనియాడిన ఆయన, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అందరూ పరస్పర సమన్వయంతో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Share This Article
Leave a review