GUNTUR DISTRICT NEWS: కొత్త రెడ్డిపాలెం ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం

Karthik

చేబ్రోలు గ్రామపంచాయతీ పరిధి కొత్త రెడ్డిపాలెం ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్ తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాలను ఆదివారం స్వయంగా తనిఖీ చేశారు. పాత పల్లెలో గత మూడు రోజుల నుంచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొత్త రెడ్డి పాలెం దళిత వాడలో పేరుకుపోయిన చెత్త చెదారం, కాలువలలో మురుగు తొలగించడం జరిగిందని వివరించారు. ప్రైవేట్ స్థలాల్లో ముళ్ళ పొదలు తొలగించి అక్కడ ఉన్న చెత్త చెదారం కూడా తొలగించామని అన్నారు. కొత్త రెడ్డి పాలెం దళితవాడలో బజారులలో శుభ్రం చేసి బ్లీచింగ్ – సున్నం జల్లి క్రిమికీటకాలు ప్రబలకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. పారిశుధ్య సిబ్బంది చేత ప్రతిరోజు శుభ్రం చేస్తున్నారని, క్లాప్ మిత్రలు చెత్త సేకరణ చేస్తున్నారని వివరించారు. ప్రతి ఇళ్లు పారిశుధ్యం పాటించి, పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి పారిశుధ్య కార్యక్రమాన్ని పక్కాగా కొనసాగించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాన్ని బాగా నిర్వహించుటకు కృషి చేస్తున్నామని, ప్రజలు భాగస్వామ్యమై సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు పంచాయతీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review