GUNTUR CITY NEWS: అనతి కాలంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఎదిగిన ఎమ్మెల్యే మాధవి – అభినందించిన రాయపాటి శ్రీనివాస్

Karthik

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమితులైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవిని మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ , మాజీ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మ్యానీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తాడిశెట్టి మురళీ మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీ అత్యున్నత స్థాయి అయిన పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. గళ్ళా మాధవి కృషి, నాయకత్వ లక్షణాలు, ప్రజల పట్ల నిబద్ధత వల్లే ఈ స్థాయికి చేరుకున్నారని అభినందించారు.
భవిష్యత్తులో కూడా పార్టీ అభివృద్ధికి, ప్రజా సేవకు మరింత కృషి చేయాలని ఆకాంక్షిస్తూ తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు గళ్ళా మాధవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్ఛం అందజేశారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review