కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు పెట్రోల్, డీజిల్ పై పెంచిన ధరలను ఖండిస్తు కాంగ్రెస్ పార్టీ జిల్లా నగర కమిటీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆటోని తాడుతో లాగుతూ ఇందన భారం గురించి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు యన్నం సుధీర్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రజల పట్ల అవాలంబిస్తున్న చేర్యలు ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు. ఇందన మరియు గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపైన భారాన్ని మోపి, దేశ ఆర్ధిక స్థితి గతులను చిన్నభిన్నాం చేశారు. దేశానికీ దిక్లేసూచి లేని విదంగా పరిపాలన చేస్తున్నారంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టారు. నగర అధ్యక్షులు ఖలీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, మాట్లాడుతూ మోడీ ఎన్నికలు ముందు ఒకలాగా తర్వాత ఇంకో లాగా ప్రవర్తించటం ప్రజలను తప్పుదోవపట్టించడం మోసం చేయడం మోడీ రాజకీయం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ సభ్యులు ఈశ్వరరావు, రాత్తయ్య, కిరణ్ వాల్మీకి శ్రీనివాస్, జాఫర్, బుజ్జి, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ లీగల్ సెల్ కృష్ణ, హడ్డు, సుభాన్, నరేష్, జానీ, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



