GUNTUR DISTRICT NEWS: విత్తనాలు అందుబాటులో ఉంచాలి

Karthik

విత్తనాలు అందుబాటులో  ఉంచాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. ప్రాథమిక రంగాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా విత్తనాలు నిజంగా ఉంచాలని అన్నారు. ఎల్ నినో ప్రభావం వలన రైతులకు ముందు జాగ్రత్త చర్యలు తెలియజేయాలని చెప్పారు. పంటలకు అవసరమైన ఎరువులు కూడా అందుబాటులో ఉండాలని అన్నారు. పంటల అనంతరం రైతుల వద్ద ఉన్న నిలువలు, వాటి విక్రయాల పైన దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే మద్దతు ధర రైతులకు తెలియజేయాలని, మద్దతు ధర కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కడైనా విక్రయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించి నష్టపోకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ టి. నరసింహా రెడ్డి, ఎ.పిఎం.ఐ.పి ఎల్. వజ్రశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review