రాష్ట్ర ప్రభుత్వం మార్చి 24న జారీ చేసిన జీవో నెంబర్ 65, సిడిఎంఏ వారి ఉత్తర్వులు తేదీ.1-04-2026 ఆర్ఓసి నం.13032/2/2026/H1-1 మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 57 ఎన్నికల వార్డులను 76 వార్డులుగా పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను సోమవారం ప్రచురించనున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సోమవారం వార్డుల సరిహద్దులతో కూడిన ప్రతిపాదిత ముసాయిదాను అధికారికంగా ప్రచురించి, నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ముసాయిదాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ముసాయిదాపై ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నగరపాలక కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగానికి వ్రాతపూర్వకంగా సమర్పించాలని కోరారు.
GUNTUR CITY NEWS: సోమవారం వార్డుల ప్రతిపాదిత ముసాయిదా ప్రచురణ – ఈ నెల 24 వరకు సలహాలు, సూచనల స్వీకరణ

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
30°C
Vijayawada
moderate rain
30° _ 30°
75%
2 km/h
Fri
32 °C
Sat
30 °C
Sun
27 °C


