GUNTUR CITY NEWS: మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత

Karthik

గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులను ఆధునికమైన మౌలిక వసతులతో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ సిఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి నగరంలోని కాకాని రోడ్, విఐపి రోడ్, ఆర్టీసి బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ సర్కిల్ నుండి కంకర గుంట ఆర్ఓబీ వరకు, విద్యా నగర్ రోడ్ లను పరిశీలించి, అభివృద్ధి పనులపై తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సంధర్భంగా కలెక్టర్ తొలుత రోడ్ల అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపియుఐఎయంయల్) ప్రతినిధులు సిద్దం చేసిన ప్రతిపాదనలను పరిశీలించి మాట్లాడుతూ, నగరంలోని ప్రధాన రహదారులను అంతర్జాతీయ ప్రమాణాలతో పచ్చని ల్యాండ్ స్కేపింగ్, వాహనాల పార్కింగ్, వెండింగ్ జోన్స్, ఆకర్షణీయమైన పెయింటింగ్స్ తో డివైడర్స్, సైన్ బోర్డ్స్, బస్టాప్స్, సోలార్ బ్లింకర్స్, వివిధ ఆకృతులతో స్ట్రీట్ లైట్లు వంటి అంశాలతో సమగ్రమైన డిపిఆర్ సిద్దం చేయాలన్నారు.కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే ఏపియుఐఎయంయల్ ప్రతినిధులతో కలిసి నగరంలో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించిన రోడ్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించామన్నారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారి సూచించిన అంశాలతో డిపిఆర్ త్వరగా చేయాలని ఏపియుఐఎయంయల్ వారిని ఆదేశించారు. పర్యటనలో జిఎంసి సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఏపియుఐఎయంయల్ ప్రతినిధులు శ్రీ కమల్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review