రాజస్థాన్ రాష్ట్రంలో NEET పరీక్ష పేపర్లు లీకైన విధానంపై మరియు మే 3 తారీఖున 22 లక్షల 70 వేల మంది విద్యార్థులు NEET పరీక్షలు రాసిన తరువాత NTA పరీక్షలను రద్దు చేయడంతో గుంటూరులో NSUI పక్షాన రాజీవ్ గాంధీ గారి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున NEET రాసిన విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరిగిన NEET-2026 పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ NSUI కో-ఆర్డినేటర్ షేక్. కరీం డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 89 పేపర్ లీక్‌లు, 48 రీ-ఎగ్జామ్స్ జరగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. వరుస ఘటనలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పూర్తిగా విఫలమైందని నిరూపిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని, దేశ ప్రధాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, అలాగే NTA చైర్మన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర NSUI అధ్యక్షులు మదన్ బాబు, జిల్లా NSUI నాయకులు S.D. మీరవాలి, పెద్ద ఎత్తున NSUI విద్యార్థిని నాయకులు పాల్గొన్నారు.
DISTRICT NEWS NEET పరీక్ష పేపర్లు లీకైన విధానంపై గుంటూరులో పెద్ద NSUI నిరసన

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
31°C
Vijayawada
overcast clouds
31° _ 31°
51%
5 km/h
Sun
33 °C
Mon
31 °C
Tue
36 °C


