జలధార – జల హారతి కార్యక్రమం నీటి వసతుల రూపురేఖలను మార్చనుంది. జిల్లాలో 12 వందలకు పైగా ఉన్న చెరువులను గుర్తించి పనులను చేసి నీటి నిల్వను చేయుటకు చర్యలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామస్థాయి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. దీర్ఘకాలంగా ఎటువంటి పనులకు నోచుకోక నీరు నిలువ కాకుండా నిరుపయోగంగా కనిపిస్తున్న చెరువులు కొద్ది రోజుల్లో జలాలతో తొణికిసలాడనుంది. ప్రతి చెరువును పూర్తిస్థామధ్యంలో నీటి నింపాలని పచ్చదనం పెంచాలని జిల్లా యంత్రాంగం యోచిస్తుంది. ఇందులో భాగంగా ఫిరంగిపురం మండలం హౌస్ గణేష్ గ్రామంలో మద్య తరహా నీటిపారుదల చెరువుగా ఉన్న హౌస్ గణేష్ చెరువును గుర్తించడం జరిగింది. దీర్ఘకాలంగా ఎటువంటి ఆదరణకు నోచుకోని ఈ చెరువు దశ మారనుంది. కొండవీడు రిజర్వు అటవీ ప్రాంతం నుండి వరద నీరు వచ్చి ఈ చెరువులోకి చేరుతుంది. 3.80 చదరపు కిలోమీటర్ల మేరా క్యాచ్ మెంట్ ప్రాంతం ఈ చెరువుకు ఉంది. 1,140 మీటర్ల చెరువుగట్టు, రెండు వేల మూడు వందల నుండి రెండు వేల ఐదు వందల మీటర్ల మేర నీటిపారుదల కాలువ కలిగి ఉంది.1,586 క్యూసెక్కుల వరద నీటిని గరిష్టంగా విడుదల చేసే సామర్థ్యం ఈ చెరువుకు ఉంది. 14.73 ఎం.సి.ఎఫ్.టి నీటి సామర్థ్యం కలిగిన హౌస్ గణేష్ చెరువు 109 ఎకరాల భూగర్భంతో 192 ఎకరాల రిజిస్టర్ ఆయా కట్టు కలిగి ఉంది. ఈ చెరువును పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యాన్ని నిలుపుదల చేయుటకు మిగులు నీరు పారుదలకు అవసరమగు మరమ్మతులు చేయడం, తూర్పు దిశగా ఉన్న చెరువుగట్లను బలోపేతం చేయడం, శిథిలావస్థలో ఉన్న స్లూయిష్ పునరుద్ధరణ చేయడం, ఫీడర్ ఛానల్ ను పునరుద్ధరణ చేయడం, చెరువు పూడికలు తీయడం అవసరమని గుర్తించడం జరిగింది. ఇందుకు రూ.76 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేయడం జరిగింది. జలధార – జల హారతి కార్యక్రమంలో భాగంగా ఈ పనులను మంజూరు చేయడం జరిగింది. “జలధార – జలహారతి” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఏప్రిల్ 18న చెరువు పనులకు శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఫీడర్ ఛానల్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. చెరువులో గరిష్టంగా నీటి నిల్వలు నింపుటకు ఫీడర్ ఛానల్ప్రా ముఖ్యత అందరికీ తెలిసిందే. క్యాచ్మెంట్ ఏరియా నుండి ఫీడర్ ఛానల్ ద్వారా చెరువులలో నీరు చేరడం జరుగుతుంది. ఫీడర్ ఛానల్ లలో ఎక్కడ ఆటంకం కలగకుండా నేరుగా నీటి ప్రవాహం ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టారు. మరమ్మతులు పూర్తి చేయడం వలన గరిష్ట నీటి నిల్వ జరిగే రిజిస్టర్ ఆయకట్టుకు సాగునీరు అందడమే కాకుండా, అదనపు ఆయకట్టుకు కూడా నీరు అందే అవకాశం పుష్కలంగా ఉంది. అధికారుల సైతం ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షణ చేస్తూ త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు చేపడుతున్నారు. జల ధార జల హారతి కార్యక్రమం జిల్లా రూపురేఖలు మారుటకు ఒక మంచి అవకాశంగా నిలుస్తుందటంలో సందేహం లేదు. జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి నీటి వసతిని గుర్తించి దాన్ని పూర్తి సామర్థ్యంతో నింపుటకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుటకు అన్ని చర్యలు చేపడతామని చెప్పారు.
GUNTUR DISTRICT NEWS: దశ మారనున్న హౌస్ గణేష్ చెరువు – జలధార – జల హారతిలో పనులు మంజూరు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
28°C
Vijayawada
broken clouds
28° _ 28°
84%
6 km/h
Sat
33 °C
Sun
37 °C
Mon
34 °C


