GUNTUR CITY NEWS: 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి

Karthik

ఎస్సీ, ఎస్టీ చట్టాలను కాలరాసే…సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకుడుగోళ్ళమూడి రాజాసుందరంబాబు విజ్ఞప్తి చేశారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ వద్ద పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు ధర్నా నిర్వహించాయి. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజాసుందరం బాబు మాట్లాడుతూ క్రైస్తవులు, ముస్లింలను గత పాలకులు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన విధంగా న్యాయం చేయాలని కోరారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review