GUNTUR CITY NEWS: ఎన్జీవో కాలనీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

Karthik
3 Views

ఎన్జీవో కాలనీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఇటీవల వేసవి కాలంలో 45 రోజుల పాటు చలివేంద్రం ద్వారా మజ్జిగ, మినరల్ వాటర్ నగర ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి, పర్యావరణవేత్త చెలికాని సీతారామయ్య, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్జ జక్కిరెడ్డి సుబ్బాయమ్మ, బి. సాంబిరెడ్డి, కిషోర్ రెడ్డి, జే. వీరారెడ్డి, డాక్టర్ చైతన్య, శివయ్య తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో వేసవి కాలంలో ఎంతో మందికి మజ్జిగ, మినరల్ వాటర్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు‌. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు అందరూ సహకారం అందించి ప్రోత్సాహించడం గర్వంగా ఉందన్నారు. దాతలు మరింతగా సహకారం అందిస్తే నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు.

Author
Share This Article
Leave a review