Guntur Distric News :గురు పౌర్ణమి సందర్భంగా పెదకాకానిలో అమ్మవారికి నెల పొంగళ్ల సమర్పణ

Sharat
1 View

పెదకాకాని: జూలై 29 :– గురు పౌర్ణమి, వ్యాసపూర్ణిమ, ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ కనకదుర్గ భవాని సహిత శ్రీ వారాహి పరమేశ్వరి దేవి ఆలయంలో భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిళా భక్తులు ఆలయానికి చేరుకుని సంప్రదాయబద్ధంగా నెల పొంగళ్లను తయారు చేసి అమ్మవారికి సమర్పించారు. అనంతరం తమ మొక్కుబడులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. గురు పౌర్ణమి వేడుకల నేపథ్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఆలయంలో ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, శ్రీచక్రానికి కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు నిత్యం జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, స్థానికులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Author
Share This Article
Leave a review