GUNTUR CITY NEWS: గుంటూరులో సిద్దమైన లేబర్ అడ్డాలు

Karthik

నగరంలో ఏర్పాటు చేస్తున్న లేబర్ అడ్డా (ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమెనిటీస్ కాంప్లెక్స్) కార్మికుల సంక్షేమానికి ఎంతో దోహదపడుతుందని, దీనిని ప్రతి ఒక్క కార్మికుడు సద్వినియోగ పరచుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. సోమవారం గుంటూరు నగరంలోని పట్టాభిపురం వద్ద కార్మికులకు ప్రత్యేకంగా నగర పాలక సంస్థ మరియు కార్మిక శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన లేబర్ అడ్డా (ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమెనిటీస్ కాంప్లెక్స్) ను కార్మికశాక అధికారులతో కలిసి సందర్శించారు. తొలుత లేబర్ అడ్డాలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి, విధ్యత్ సౌకర్యం లేకపోవుట గమనించి, వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ఎంతో ప్రాదాన్యతనిస్తుందని, దీనికోసం సమీకృత కార్మిక సౌకర్యాల సముదాయంతో లేబర్ అడ్డా ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. కార్మికులు పని కోసం రోడ్ల మీద వేచి ఉండకుండా, లేబర్ అడ్డాల్లో వేచి ఉండటానికి అన్ని సదుపాయాలతో ఈ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటిలో రక్షిత త్రాగు నీరు, ప్రధమ చికిత్స, స్త్రీ పురషులకు వేరువేరుగా మరుగు దొడ్లు ఏర్పాటు చేయుట జరుగుతున్నారు. కార్మికుల నూరు శాతం క్రమబద్దీకరణ కోసం ఆధార్, బ్యాంకు కాతా మరియు మొబైల్ అనుసంధానం, హక్కులు బద్రత మరియు ఆర్ధిక అక్షరాశ్యత పై నిరంత అవగాహనా తదితర కార్మికుల ఉన్నతి కొరకు సేవలందించే ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు కూడా ఏర్పాటు చేయుట జరుగుతుందన్నారు. దీనిని వీలైనత త్వరలో కార్మిక శాఖ ప్రారంభించి, అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఏ గాయత్రీ దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.కార్యదర్శులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review