గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల నిర్వహణలో కాంట్రాక్టర్లు నాణ్యతాప్రమణాలు పాటించేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రతేక పర్యవేక్షణ చేయలాని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని 2వ డివిజన్ లలోని మణిపురం బ్రిడ్జ్, సీతా నగరం మరియు నగరంలోని ప్రధాన రహదారుల్లో అధికారులతో కలిసి పర్యటించి పారిశుధ్య పనులు, అభివృద్ధి పనులను తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత మణిపురం బ్రిడ్జ్ వద్ద 15వ ఆర్ధిక సంఘం నిధులతో నూతనంగా నిర్మించిన సైడు కాలువ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతూ, అభివృద్ధి పనులు నిర్వహించడానికి ముందే మార్కింగ్ ని పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి చేయాలని, తద్వారా పనుల్లో సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు. అలాగే డ్రైన్ నిర్మాణానికి కరెంట్ పోల్స్ అడ్డుగా ఉంటె వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి, కరెంట్ పోల్స్ షిఫ్ట్ చేసిన తరువాత మాత్రమె పనులు ప్రారంభించాలన్నారు. అలాగే అభివృద్ధి పనులు జరిగే సమయంలో ఇంజనీరింగ్ అధికారులు మరియు ఏమినిటి కార్యదర్శులు అభివృద్ధి పనులను క్షేత్ర స్తాయిలో పర్యవేక్షించి, పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సీతానగర్ నందు పర్యటించి సెక్రటరీలు నిర్వహిస్తున్న వివిధ సర్వేల వివరాలు మరియు వాటి పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. డివిజన్లలో జరుగుతున్న పారిశుధ్య పనులను తనిఖీ చేసి, నూరు శాతం డోర్ టు డోర్ చెత్త సేకరణ జరగాలని, ప్రజల వద్ద నుండివ్యర్ధాలను తడి పొడి వ్యర్ధాలుగా విభజించి సేకరించాలన్నారు. అలాగే ప్రజలు గృహాల వద్దే హోం కంపోస్ట్ తయారు చేసేలా వారికి అవగాహన కలిగించాలని ఆదేశించారు. అంతేకాక నగరంలోని ప్రధాన రహదారుల్లో పర్యటించి, పలు ప్రాంతాలలో పోస్టర్లు మరియు బ్యానర్లు ఉండుట గమనించి, వెంటనే వాటిని తొలగించి, బాధ్యులైన వారి పై అపరాధరుసుము విధించాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఇంచార్జ్ అదనపు కమిషనర్ జి. సాంబశివరావు, ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది, ప్రజారోగ్యాదికారులు సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
31°C
Vijayawada
overcast clouds
31° _ 31°
55%
6 km/h
Sun
30 °C
Mon
34 °C
Tue
37 °C


