GUNTUR DISTRICT NEWS: ఆసుపత్రులు, కార్యాలయాల్లో ఫైర్ ఆడిట్ – ప్రజల సురక్షిత ప్రథమ ప్రాధాన్యత

Karthik

ఆసుపత్రులు, కార్యాలయాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. మంగళ, బుధవారాలలో జరిగిన అగ్ని ప్రమాదాలు దృష్ట్యా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పలు విషయాలను వెల్లడించారు. ఫైర్ ఆడిట్ తో పాటు ఆసుపత్రిలో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి నెల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించినట్లు చెప్పారు. ఫైవ్ ఆడిట్ లో కనుగొన్న లోపాలను సంబంధిత ఆసుపత్రిలు, కార్యాలయాలు తక్షణం పునరుద్ధరణ చేయాలని పేర్కొన్నారు. అగ్నిమాపక పరికరాల ఎక్స్పైరీ డేట్ ను కూడా విధిగా పరిశీలించాలని అన్నారు. వేసవి తీవ్రత ఉందని ఈ సమయంలో విద్యుత్తు ఉపకరణాలు వినియోగం అధికంగా ఉంటుందని విద్యుత్ లోడుకు తగిన విధంగా లేనట్లయితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొంటూ అటువంటి లోపాలు కనుగొనుటకు విద్యుత్ ఆడిట్ ను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. అగ్నిమాపక పరికరాల వినియోగం, నిర్వహణ అమలును పర్యవేక్షణ చేయడం జరుగుతుందని చెప్పారు. షాపింగ్ మాల్స్, సినిమా హాల్ లు తదితర ప్రదేశాల్లో సైతం అగ్ని మాపక పరికరాల పనితీరు పరిశీలించడం జరుగుతుందని అన్నారు. మొదటగా వంద పడకలకు పైగా ఉన్న ఆసుపత్రుల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. గత నెలలో అగ్ని ప్రమాదాలపై మీడియాలో ప్రచురితమైన ఒక వార్త బాగా ఉపయోగపడిందని జిల్లా కలెక్టర్ అన్నారు. వార్త సమాచారంతో వెంటనే అగ్నిమాపక అధికారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆ మేరకు జి జి హెచ్ లో మాకు డ్రిల్ నిర్వహణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ మార్క్ డ్రిల్ కార్యక్రమం మంగళవారం జరిగిన అగ్ని ప్రమాద నివారణకు ఎంతగానో తోడ్పడిందని అన్నారు. ప్రజల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.ఈ మీడియా సమావేశంలో జిల్లా అగ్నిమాపక అధికారి ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review