GUNTUR DISTRICT NEWS: స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Karthik

ఆరోగ్య భారతదేశమే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వం తో…. అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కలసి వచ్చి మెరుగైన ఫలితాలు రాబట్టాలని కేంద్ర సమాచార మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం కేంద్ర మంత్రి కార్యాలయంలో తనను కలిసిన రెడ్ క్రాస్ మరియు రోటరీ ప్రతినిధులతో మాట్లాడుతూ… ప్రమాదాలలో గాయపడి చేతులు కోల్పోయిన దివ్యాంగులకు అధునాతనమైన కృత్రిమ చేతులను అమర్చి వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న రెడ్ క్రాస్ మరియు రోటరీ సంస్థల యొక్క సేవలు ఆదర్శనీయమని అన్నారు. కృత్రిమ చేతుల అమరిక ద్వారా విభిన్న ప్రతిభావంతులు ఎవరి మీద ఆధారపడకుండా తమ పని తాము చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగించుటకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో సామాజిక సేవ లయందు, ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు, రక్త నిధి కేంద్రాల నిర్వహణ వంటి వివిధ రంగాలలో తన సేవలు విస్తృత పరుస్తున్నదని, రెడ్ క్రాస్ గుంటూరు జిల్లా శాఖకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ పి. రామచంద్ర రాజు మాట్లాడుతూ ” చేయూత – హెల్పింగ్ హాండ్స్” ప్రాజెక్టుతో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ లోని మూడు ప్రాంతాలలో ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాలలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సేవా సంస్థ అయిన ఎల్. ఎన్. 4 హ్యాండ్ ప్రాజెక్ట్ వారు అధునాతన హై క్వాలిటీ కృత్రిమ చేతులను దివ్యాంగులకు అందజేస్తున్నారని, ఈ చేతులను అమర్చుకొని మెరుగైన జీవన విధానము తో ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో బ్రతకడానికి మార్గం ఏర్పడుతుందని రాజు తెలిపారు. ఈ సందర్భంగా ” చేయూత ” పోస్టర్ని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధి నంబూరు సుబ్బారావు, రెడ్ క్రాస్ సభ్యులు రవిశంకర్, రెడ్ క్రాస్ ఫీల్డ్ ఆఫీసర్ SK జానీ రసూల్ పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review