GUNTUR CITY NEWS: విద్యార్థులు తల్లిదండ్రులకు ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ అజీజ్ సూచనలు

Karthik

టెన్త్ ఇంటర్ పాసైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మీరు కొత్తగా ఏ కాలేజీలో చేరుతున్న ఆ కాలేజీ యొక్క పరిసర ప్రాంతాలు క్షుణ్ణంగా తల్లిదండ్రులు పరిశీలించాలి. మీరు మీ పిల్లల్ని చేర్పించే కాలేజీలో అంతకుముందు ఆ కాలేజీలో చదివే పిల్లలపై ఏమైనా డ్రగ్స్ సంబంధించిన కేసులు ఉన్నాయా లేదా అని తరవుగా చెక్ చేసుకోవాలి. మీరు ఎంతో కష్టపడి మీ పిల్లల్ని చదివిస్తున్నారు.. అలాంటప్పుడు రోజు మొత్తం మీ పిల్లలు చదువుకునే కాలేజీల్లో ఏమి జరుగుతుందనేది కూడా మీరు గమనిస్తూ ఉండాలి. ప్రస్తుత కాలంలో కాలేజీ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ వాడుతున్న వారిలో ఎక్కువ మంది కాలేజీ పిల్లలు ఉండటం ఆందోళనకు గురిచేస్తుంది. మీ పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసే ముందే ఆ కాలేజీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని జాయిన్ చేయండి. మీ పిల్లలను శ్రద్ధగా చదివించి చక్కటి భారత దేశ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను.

Author
Share This Article
Leave a review