విద్యుత్ శాఖలో పనిచేయుచున్న కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించి వారిని పరిమినెంట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు జేఏసీ చైర్మన్ , ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రఅధ్యక్ష ప్రధానకార్యదర్శిలు కట్టానాగరాజు, అచ్చుకోలు రాజేంద్రప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక కొత్తపేట మల్లయ్య లింగంభవన్ లో జరిగినఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఉమ్మడి గుంటూరు జిల్లా సదస్సు జరిగింది సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యుత్ కాంట్రాక్టు కార్మికులందరికీ ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్టర్ పేమెంట్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, వేతన సవరణతో పాటు గ్రాడ్యుటి, హెల్త్ కార్డులు, ఈఎస్ఐ,పిఎఫ్, పెయిడ్ హాలిడేస్, సర్వీస్ ఇంక్రిమెంట్లు తదితర సంక్షేమ పథకాలను త్వరితగతిన అమలు చేయాలని వారు కోరారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రావుల అంజిబాబు మాట్లాడుతూ ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో సైతం తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవలందిస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించకుండా యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందని ప్రమాదవశాత్తు విధుల్లో ఉన్న కార్మికులు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోలేని ఈ ప్రభుత్వాల విధానాలపై కార్మికులు దశల వారి ఆందోళన చేపట్టడానికి ఈ సదస్సు ద్వారా పోరాటాలకు సిద్ధంగా ఉన్నారని ఇప్పటికైనా విద్యుత్తు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు.



