జూన్ 5 నుండి ప్రారంభమయ్యే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధి విధానాల గురించి జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 5 నుండి 14 వరకు బిఎల్వోలు, ఈ ఆర్ ఓ, ఏ ఈ ఆర్ ఓ లు తదితరులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. అనంతరం జూన్ 15 నుండి జులై 14 వరకు ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారంలను అందజేస్తామన్నారు. ప్రతి ఒక్క ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలను పూరించి తప్పనిసరిగా తిరిగి అందజేయాలన్నారు. జులై 21న డ్రాఫ్ట్ పబ్లికేషన్ అందుబాటులో ఉంచుతామని , ఆగస్టు 20 లోపు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. వచ్చిన అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి తుది ఓటరు జాబితా సెప్టెంబర్ 22 న ప్రచురిస్తామన్నారు.ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ లు గంగ రాజు, లక్ష్మి కుమారి, శ్రీనివాస్, ఎస్.సి కార్పొరేషన్ ఇ.డి డి.దుర్గా భాయి, టిడిపి – ఓంకార్, జనసేన – త్రినాధ్, ఆమ్ ఆద్మీ పార్టీ – సేవ కుమార్, బి.ఎస్.పి – వాసు తదితరులు పాల్గొన్నారు.



