GUNTUR DISTRICT NEWS: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది

Karthik

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరిగింది. బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి పొన్నూరు రోడ్డు వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, ఇతర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూరీ ఫాతిమా, శ్యామలా, మహేష్ మీడియాతో మాట్లాడారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటుకు గురి కాని సామాజిక వర్గం లేదన్నారు.కూటమి పాలన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత నెలకొందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు అమలు జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని స్పష్టం చేశారు.

Author
Share This Article
Leave a review