GUNTUR CRIME NEWS: గుంటూరులో లిక్విడ్ గంజాయి పట్టివేత – ముగ్గురు నిందితుల అరెస్ట్

Karthik

గుంటూరులో లిక్విడ్ గాంజా తరలిస్తూ పట్టుబడిన బీటెక్ విద్యార్థి తో పాటు మరో ఇద్దరు స్నేహితులు. లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులు మీడియా ముఖంగా వివరాలు వెల్లడించిన ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్చార్జి డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి. ఐపిడి కాలనీ సత్యసాయి ట్రస్టు వద్ద సాధారణ తనిఖీలు చేస్తుండగా మహీంద్రా SUV 500 వాహనంలో అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు కనపడ్డారు. వారిపై అనుమానం రావడంతో కారుని క్షుణ్ణంగా పరిశీలించగా సుమారు రెండు కిలోల గ్రాముల లిక్విడ్ గంజా లభించింది. ప్రథమ ముద్దాయి రామిశెట్టి మహావీర్ గంజాయికి అలవాటు పడి ఒడిశా రాష్ట్రం నుంచి లిక్విడ్ గంజాయి కొనుగోలు చేసి గుంటూరు పరిసర ప్రాంతాల్లో వాటిని విక్రయిస్తున్నాడు. రామిశెట్టి మహావీరుతో పాటు అతను స్నేహితులు అబ్బు సాయి మణికంఠ తేజను, షేక్ రహంతుల్లా ను అరెస్ట్ చేయడం జరిగింది. రామిశెట్టి సాయి మంగళగిరిలో ఉన్న ప్రముఖ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. వీరికి సహాయం చేస్తున్న మరో ఇద్దరి నిందితులు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు.

Author
Share This Article
Leave a review