GUNTUR DISTRICT NEWS: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగానే పునాది

Karthik

యోగాను భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మాసాని చంద్ర శేఖర్ పేర్కొన్నారు. 12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఆదివారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ , జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ , గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ పాల్గొన్నారు. అంతర్జాతీయా యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ న్యూ ఢిల్లీ నుండి పాల్గొన్న కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని , ప్రసంగాన్ని వీక్షించడం జరిగింది. అనంతరం ఆయుష్ శాఖ యోగా ఇన్స్పెక్టర్ వెంకటేష్ కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగాభ్యాసాలు చేయించారు. గుంటూరు నటరాజ్ అకాడమీ యోగా గురువు విజయ గౌరీ నేతృత్వంలో సూర్యమంత్రంతో సూర్య నమస్కారాలు , యోగా ద్వారా సమతుల్య ఆహారాన్ని ఎలా తీసుకోవాలి అనే అంశాన్ని నృత్య ప్రదర్శన ప్రదర్శించారు.

Author
Share This Article
Leave a review