అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ‘యోగాంధ్ర – 2026’ పేరుతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ (Yoga for Healthy Aging) నినాదంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతాయని చెప్పారు. యోగా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అన్ని రంగాల్లో ఉన్నవారిని యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తామన్నారు. ఈ నెల్ల 7 నుంచి 20వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టి ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. జూన్ 21న రాష్ట్ర స్థాయి యోగా దినోత్సవ వేడుకలు అమరావతిలో జరుగుతాయన్నారు. జిల్లాలో ఉండవల్లి గుహలు, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వంటి ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. జూన్ 7 నుంచి 9వ తేదీ వరకు గ్రామ/వార్డు స్థాయిలోనూ, జూన్ 10 నుంచి 12వ తేదీ వరకు మండల స్థాయిలోనూ, జూన్ 14 నుంచి 16వ తేదీ వరకు జిల్లా స్థాయిలో పోటీలు ఉంటాయని వివరించారు. జూన్ 18 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిపారు. వ్యక్తిగత విభాగం, బృంద విభాగం, జ్ఞాన ఆధారిత యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. వ్యక్తిగత విభాగంలో ఆసనాల ప్రదర్శన, ప్రాణాయామం., జ్ఞాన ఆధారిత పోటీలలో యోగా క్విజ్, యోగా వ్యాసరచన, యోగా నినాదాల పోటీలు ఉంటాయన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలోని పార్కులు, పాఠశాలలు, క్రీడా ప్రాంగణాల్లో కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
GUNTUR DISTRICT NEWS: జూన్ 7 నుంచి 20వ తేదీ వరకు యోగా కార్యక్రమాలు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
34°C
Vijayawada
scattered clouds
34° _ 34°
49%
4 km/h
Tue
34 °C
Wed
41 °C
Thu
42 °C


