అయోధ్య అవినీతి, గాజా యుద్ధం, ఏపీ అభివృద్ధిపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన చింతామోహన్

City News Telugu
44.5K Views


విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ :చింతామోహన్ విమర్శలు

విజయవాడ:అయోధ్య రామమందిర నిర్మాణ నిధుల వినియోగం, గాజా యుద్ధం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, జగన్ అక్రమాస్తుల కేసులు, రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతామోహన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అయోధ్య రామమందిరం పేరుతో దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు సేకరించారని, ఆ నిధుల వినియోగంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న అంశాలపై కూడా విచారణలు జరుగుతుంటే, అయోధ్య నిధుల వ్యవహారంపై ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం సందర్భంగా గాజాలో వేలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినా భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. భారత విదేశాంగ విధానం గతంలో నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ కాలంలో ఉన్న స్వతంత్ర ధోరణికి భిన్నంగా మారిందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై స్పందిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలు తిరిగిన తనకు ఆ స్థాయిలో పెట్టుబడులు లేదా అభివృద్ధి పనులు కనిపించలేదని వ్యాఖ్యానించారు.Track Your Application Status

కుప్పం నియోజకవర్గాన్ని ప్రస్తావిస్తూ, చంద్రబాబు నాయుడు దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ అక్కడ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.Join Our News Team

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపై కూడా ఆయన స్పందించారు. జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయం ఉండకూడదని అన్నారు. అక్రమాస్తుల కేసులపై న్యాయ ప్రక్రియ వేగవంతం కావాలని అభిప్రాయపడ్డారు.reporter

రాష్ట్రంలో ఇటీవల పోలీసుల వ్యవహార శైలిపై కూడా చింతామోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు చట్ట పరిరక్షకులుగా వ్యవహరించాల్సి ఉండగా, కొన్నిచోట్ల అతిగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.Contact

కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటుందని చింతామోహన్ స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Article
Leave a review