నకరికల్లు: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కపోతేశ్వర స్వామి దేవస్థానాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చేజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.



