పెదవేగి: ఏలూరు జిల్లా పెదవేగి మండలం జానంపేట గ్రామంలో వినాయక చవితి 9వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రామాలయం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు గ్రామంలో సందడి నెలకొంది.
సోమవారం గణపతి పూజతో ప్రారంభమైన ఉత్సవాలు ఏడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం మహా అన్నదాన సమారాధన నిర్వహించనున్నట్లు రామాలయం యూత్ సభ్యులు తెలిపారు. ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం గణనాథుడి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.Eluru District City News
వినాయక చవితి వేడుకల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జానంపేట రామాలయం యూత్ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.



