vijayawada City news: 50వ డివిజన్‌లో డోర్ టు డోర్ కార్యక్రమం-ప్రజల సమస్యలను తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న

Sharat
1 View

విజయవాడ:– పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్‌లో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతుల ఇబ్బందులు, డివిజన్ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రజల నుంచి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా వివరించడంతో వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని బుద్ధా వెంకన్న తెలిపారు.

ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు వారి సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడమే డోర్ టు డోర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం, డివిజన్ల అభివృద్ధికి అవసరమైన చర్యలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో 50వ డివిజన్ అధ్యక్షురాలు కుప్పుల అరుణ శ్రీ గంగాధర్, ఎన్టీఆర్ జిల్లా బీసీ కార్యదర్శి యాట్ల ప్రసాద్, డివిజన్ ప్రధాన కార్యదర్శి కాళ్ళ ఈశ్వరరావు, వీర్ల వాసు, సుంకర శివ, కండుబోతు శ్రీను, రమాదేవి, మోబినా తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review