Bapatla City news :వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల-వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు ఎం. వేణుగోపాల్ రెడ్డి

Sharat
2 Views

బాపట్ల:– వినికిడి లోపం ఉన్న విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు బాపట్ల జిల్లాలోని వెదుళ్లపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు ఎం. వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

2026–27 విద్యా సంవత్సరానికి కళాశాలలో మొత్తం 30 సీట్లతో బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) కోర్సును అందించనున్నారు. దీనికి అదనంగా ఏఐ సర్టిఫికేషన్ కోర్సును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలోని వినికిడి లోపం ఉన్న ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 23, 2026లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినికిడి లోపం ఉన్న విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యలో ముందుకు సాగాలని అధికారులు కోరారు.

మరిన్ని వివరాల కోసం 9000013633, 9948372899 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని గుంటూరు జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు ఎస్. వెంకటరమణప్ప ఒక ప్రకటనలో తెలిపారు.

Author
Share This Article
Leave a review