ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బాజివలి సెల్ఫీ ఆత్మహత్యకు సంబంధించిన విషయంపై ఈస్ట్ డిఎస్పి టీ.సీతారాం వివరణ ఇచ్చారు. డిఎస్పి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మే నెలలో ఖతీజా అనే మహిళకు మరియు బాజీవలి కి నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి సంబంధించిన ఖర్చులు నిమిత్తం బాజివలి కి ఖతీజ కుటుంబ సభ్యులు ఐదు లక్షల రూపాయలు నగదు ఇచ్చారు. బాజివలి ఐదు లక్షల రూపాయల నగదుతో బీబీ ఫ్యాషన్స్ అనే బట్టల షాపుని ప్రారంభించాడు. ఆ బట్టల షాపులో పనిచేసే భవాని అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో పెళ్లి కేన్సిల్ చేసుకొని ఖతీజ వాళ్ల అమ్మ ఇచ్చిన నగదును వెనక్కు ఇవ్వమని కోరింది.బాజివలి ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఖతిజా యొక్క అమ్మ ఫిర్యాదు చేసింది. అక్కడ ఈ విషయంపై ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది.ఖతీజ వాళ్ళ కుటుంబ సభ్యులకు మరియు బాబావలికి గొడవ జరగడంతో బాజివలి కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ విషయమై కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది.ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు ఉండటం వల్ల పోలీసు వారు రాజ్యాంగాన్ని అనుసరించి కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది.ఈ కేసులో పోలీసు వారికి ఎలాంటి స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. బాజివలి తన వ్యక్తిగత మర్యాదకు భంగం కలిగిందని భావిస్తే ఖతీజ కుటుంబ సభ్యులపై కోర్టులో పోరాడవచ్చు. సివిల్ మ్యాటర్స్ లో పోలీసులు న్యాయం చేయట్లేదు అంటూ పోలీసులపై విష ప్రచారం చేయటం మంచి పద్ధతి కాదని డీఎస్పీ టి.సీతారాం వెల్లడించారు.
GUNTUR CRIME NEWS: బాజివలి ఆత్మహత్య యత్నం ఘటనలో పోలీసు అధికారుల ప్రకటన

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
28°C
Vijayawada
overcast clouds
28° _ 28°
78%
3 km/h
Mon
30 °C
Tue
34 °C
Wed
35 °C


