తాడికొండ 220 కెవి సబ్ స్టేషనును సందర్శించిన జేసీ

Karthik

రానున్న తుఫాను దృష్ట్యా తాడికొండ 220 కెవి సబ్ స్టేషన్ nu జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదివారం సందర్శించారు. 18,19, 20 తేదీల్లో అధిక వర్షాలు ఉంటాయని వాతావరణ సూచనలు మేరకు విద్యుత్తు అంతరాయం కలగకుండా సబ్ స్టేషన్ లో ముందస్తు చర్యలు చేపట్టుకు సందర్శించారు. మురసు తుఫాన్ లో సబ్ షన్ వద్ద ఎక్కువ వరద రావడం, దాన్ని తొలగించుటకు గల్ఫర్ మెషిన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా సబ్ స్టేషన్ లో విద్యుత్తు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రానున్న తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా 19వ తేదీన 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగలదని సూచనలు మేరకుఅచ్చట వరద చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టుటకు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, సి పి డి సి ఎల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review