ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుడిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్న మహిళ అరెస్ట్. నేరం జరిగిన 36 గంటల్లోనే కేసును ఛేదించిన పొన్నూరు టౌన్ పోలీసులు. మొత్తం చోరీ సొత్తు రికవరీ.గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు, తెనాలి డీఎస్పీ బి. జనార్ధనరావు పర్యవేక్షణలో పొన్నూరు టౌన్ సీఐ ఆర్.ఎస్. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుడిపై దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్న కేసును అత్యంత వేగంగా ఛేదించారు. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. పొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ క్రైం నంబర్ 183/2026, సెక్షన్ 309(6) BNS కింద కేసు నమోదు చేయబడింది. ఫిర్యాదుదారు : గడ్డం రత్తయ్య, వయస్సు 76 సంవత్సరాలు, విద్యానగర్ 1వ లైన్, 6వ వార్డు, పొన్నూరు పట్టణం.నిందితురాలు: మినిగల సువర్ణ @ సూరమ్మ, వయస్సు 53 సంవత్సరాలు, పచ్చల తాడిపర్రు గ్రామం, పొన్నూరు మండలం.నేరం జరిగిన విధానం: ఫిర్యాదుదారు రత్తయ్య గారు ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న విషయం నిందితురాలికి ముందుగానే తెలుసు. గతంలో ఫిర్యాదుదారుడి పొలంలో నిందితురాలు పనిచేసినందున ఆమెకు ఆయనతో పరిచయం ఉంది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని నిందితురాలు గత కొన్ని రోజులుగా ఫిర్యాదుదారుడి ఇంటిపై నిఘా పెట్టి, ఇంట్లోని బీరువా ఉన్న ప్రదేశాన్ని కూడా గమనించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధుడిని లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేయాలని ముందుగానే పథకం వేసుకుంది.21.08.2026 మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో నిందితురాలు ఒక సంచిలో కారం పొట్లం, బండరాయి పెట్టుకుని ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లింది. తలుపు తీయగా, తెలిసిన వారికి ఇల్లు అద్దెకు కావాలని, మంచినీళ్లు కావాలని చెప్పి ఇంట్లోకి ప్రవేశించింది. ఫిర్యాదుదారు మంచినీళ్లు తెచ్చి ఇవ్వగా, ఇంట్లో మరియు పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న నిందితురాలు ఇదే అదునుగా భావించి ఫిర్యాదుదారుడి కళ్లలో కారం కొట్టింది. ఆయన అరవకుండా నోటిని చేతితో గట్టిగా నొక్కి, గొంతు పట్టుకుని కిందపడేసి దాడి చేసింది. అనంతరం బెడ్‌రూమ్‌లోని బీరువా వద్దకు వెళ్లి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును తీసుకుని అక్కడి నుంచి పరారైంది.చోరీకి గురైన సొత్తు: 36 గంటల్లోనే నిందితురాలి అరెస్ట్ : కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పొన్నూరు టౌన్ సీఐ ఆర్.ఎస్. కిషోర్ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని సాంకేతిక నిపుణుల సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించారు. పటిష్టమైన దర్యాప్తు, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితురాలిని నేరం జరిగిన 36 గంటల్లోనే అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద నుంచి చోరీకి గురైన మొత్తం సొత్తును రికవరీ చేసి, తదుపరి నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.
GUNTUR DISTRICT NEWS: పొన్నూరులో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
28°C
Vijayawada
overcast clouds
28° _ 28°
78%
3 km/h
Sun
28 °C
Mon
30 °C
Tue
34 °C


