త్వరలో జరగనున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిసెప్షన్ సెంటర్, బ్యాలెట్ బాక్స్ ల భద్రపరచు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటుకు నల్లపాడులోని ప్రభుత్వ పాల్ టెక్నిక్ కాలేజి, లయోలా పబ్లిక్ స్కూల్ లను శనివారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పాల్ టెక్నిక్ కాలేజి, లయోలా స్కూల్ ల్లో ఎన్ని గదులు ఉన్నదీ, ఎంత విస్తీర్ణంలో ఉన్నదీ, వాహనాల రాకపోకలకు మార్గాలు, వాహనాల పార్కింగ్, రిసిప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్లు వంటి వాటి కోసం పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాహనాల పార్కింగ్, కౌంటింగ్ కి అవసరమైన గదుల్లో ఫర్నీచర్, బారీకేట్ల ఏర్పాటు తదితర అంశాలతో సమగ్ర మ్యాప్ ని సిద్దం చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.పర్యటనలో అదనపు కమిషనర్ జి.సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఎస్ఈ సుందర్రామిరెడ్డి పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: కార్పోరేషన్ ఎన్నికలకు శరవేగంగా పనులు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
35°C
Vijayawada
overcast clouds
35° _ 35°
46%
4 km/h
Sat
33 °C
Sun
36 °C
Mon
37 °C


